Skip to main content

Telugu News Power

Blog

అంగన్వాడీలకు జీతాలు పెంచాలి – పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి డిమాండ్.

భీమవరం:డిసెంబర్,12(తెలుగు న్యూస్ పవర్) అంగన్వాడి ఉపాధ్యాయులకు 26 వేల రూపాయల కనీస జీతం ఇవ్వాలని పిడిఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమవరంలో తమ డిమాండ్ల సాధన మేరకు అంగన్వాడి ఉపాధ్యాయులు, వర్కర్లు సి ఐ టి యు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గోపి మూర్తి మాట్లాడుతూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. ఎఫ్ ఆర్ ఎస్ యాప్ రద్దు చేయాలని విజ్ఞప్తి…

Read More

విద్యార్థినులకు వాకర్స్ క్లబ్ ధన సహాయం

పాలకొల్లు:డిసెంబర్,12 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లుకు చెందిన నల్లా లీల సాయి లక్ష్మికి పాలకొల్లు వాకర్స్ క్లబ్ వారు10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈమె ఇటీవల ప్రమాదానికి గురయ్యారు. ఈమెకు ఫిజియోథెరపీ చికిత్స నిమిత్తం ఈ సహాయం అందజేశారు. ఈమె స్థానిక ఛాంబర్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. ఇదే కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న పోతాబత్తుల కీర్తనకు ఫీజు నిమిత్తం 6 వేల రూపాయలు ధన సహాయం చేశారు. యువతులు ఎన్ని అడ్డంకులు…

Read More

పుట్టినరోజు సందర్భంగా పంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర వాహనం.

యలమంచిలి:డిసెంబర్,12(తెలుగు న్యూస్ పవర్) మండల తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రామాంజనేయులు,అంజిబాబు, వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర వాహనం సమకూర్చారు. పంచాయతీకి శుక్రవారం ఈ వాహనాన్ని అప్పగించారు. అడవిపాలెం గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర వాహనం లేకపోవడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగిన అందుకు సంబంధించిన వ్యర్ధాలను తరలించడం కష్టమవుతుంది. పాలకొల్లు నుంచి వచ్చే వాహనాలు ఇక్కడ ఉంచడం లేదు. ఇరుకు సందులు ఉన్న చోటుకు ఈ వాహనం వెళ్లడం…

Read More

వీఆర్ఏల చలో అమరావతి.

యలమంచిలి:డిసెంబర్,12 (తెలుగు న్యూస్ పవర్) తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని గ్రామ రెవెన్యూ సహాయకులు చలో అమరావతి ఆందోళన చేపట్టారు. ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు అమరావతి చేరుకొని, నిరసన వ్యక్తం చేయనున్నట్లు యలమంచిలి మండల వీఆర్ఏల సంఘ అధ్యక్షులు కొమ్మిరెడ్డి రామకృష్ణ స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద శుక్రవారం తెలిపారు. ఈ మేరకు వీఆర్ఏలు సంతకాలు సేకరించి తహసిల్దార్ గ్రంధి పవన్ కుమార్ కు మెమోరాండం అందజేశారు. వి ఆర్ ఏ లు…

Read More

ఐచ్ఛిక సెలవులు (Optional Holidays – 2026)

క్రమ సంఖ్య పండుగ / సందర్భం తేదీ రోజు 1 నూతన సంవత్సర దినోత్సవం 01-01-2026 గురువారం 2 హజ్రత్ అలీ జన్మదినం 03-01-2026 శనివారం 3 షాబ్-ఇ-మెరాజ్ 16-01-2026 శుక్రవారం 4 షాబ్-ఇ-బరాత్ 03-02-2026 మంగళవారం 5 హజ్రత్ అలీ షహాదత్ 11-03-2026 బుధవారం 6 జుమాతుల్-విదా 13-03-2026 శుక్రవారం 7 షాబ్-ఏ-కదర్ 15-03-2026 ఆదివారం 8 మహావీర్ జయంతి 31-03-2026 మంగళవారం 9 బసవ జయంతి 20-04-2026 సోమవారం 10 బుద్ధ పౌర్ణమి 01-05-2026…

Read More

ఆంధ్రప్రదేశ్ – 2026 ప్రభుత్వ సాధారణ సెలవులు

క్రమ సంఖ్య పండుగ / సందర్భం తేదీ రోజు 1 భోగి 14-01-2026 బుధవారం 2 మకర సంక్రాంతి 15-01-2026 గురువారం 3 కనుమ 16-01-2026 శుక్రవారం 4 గణతంత్ర దినోత్సవం 26-01-2026 సోమవారం 5 మహా శివరాత్రి 15-02-2026 ఆదివారం 6 హోలీ 03-03-2026 మంగళవారం 7 ఉగాది 19-03-2026 గురువారం 8 రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) 20-03-2026 శుక్రవారం 9 శ్రీ రామనవమి 27-03-2026 శుక్రవారం 10 గుడ్ ఫ్రైడే 03-04-2026 శుక్రవారం 11 బాబు…

Read More

ఉత్తమ ఫలితాలకు 10వ తరగతి యాక్షన్ ప్లాన్

పాలకొల్లు డిసెంబర్ 11 తెలుగు న్యూస్ పవర్ పదవ తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి పదో తరగతి యాక్షన్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని రీజినల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడానికి తీసుకోవాల్సిన విధి విధానాలపై చర్చించడానికి ఆర్జెడి నాగమణి పాలకొల్లు సందర్శించారు. స్థానిక బి.ఆర్. ఎం.వి పాఠశాలలో గురువారం జరిగిన సమావేశం లో ఆర్జేడి నాగమణి ఇప్పటివరకు జరిగిన పదవ తరగతి విద్యార్థుల వందరోజుల యాక్షన్ ప్లాన్…

Read More

మహిళల అక్రమ రవాణా పట్ల అప్రమత్తంగా ఉండాలి.

పాలకొల్లు:డిసెంబర్,11 (తెలుగు న్యూస్ పవర్) మనుషుల అక్రమ రవాణా ప్రపంచంలోనే అతిపెద్ద నేరంగా పరిగణించబడుతుందని పాలకొల్లు మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాదుకు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ శిక్షణ కార్యక్రమం గురువారం ముగింపు సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ,ప్రతిరోజు ఎంతోమంది యువతులు, మహిళలు మానవ రవాణాకు బలి అవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగం,సినిమాలలో అవకాశం ఇప్పిస్తామని నేరస్తులు పన్నే ఉచ్చులో పడవద్దని హెచ్చరించారు. వారి వలలో చిక్కుకున్న వారిని…

Read More

హనుమద్ వ్రత రథోత్సవం

యలమంచిలి:డిసెంబర్,11 (తెలుగు న్యూస్ పవర్) అడవిపాలెం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి హనుమద్ వ్రత ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం రాత్రి రథోత్సవం జరిగింది. ఈ ఉత్సవాలు ఈనెల 3 నుంచి 11 వరకు తొమ్మిది రోజులు పాటు జరిగాయి. గంధం గంగాధర్, నాగమణి దంపతుల చే ఈ పూజలు ప్రారంభించారు. స్వామి వారికి పంచామృత అభిషేకం, తమలపాత్ర పూజ వంటి పూజలు జరిపారు. రథోత్సవం కోలాటం భజన, నృత్యబృందాలతో ఘనంగా జరిగింది. ఈ పూజా…

Read More