వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ పై కార్మికలోకం హర్షం.
పాలకొల్లు: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ నిర్ణయం పై ప్రభుత్వానికి, స్థానిక శ్రీ వెంకటేశ్వర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. స్థానిక సంఘ కార్యాలయ భవనంలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో హర్షం ప్రకటించారు. ఈ సమావేశానికి పెచ్చెట్టి బాబ్జి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు చొరవతో, కార్మిక శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ కృషి వల్ల బోర్డు మళ్లీ జీవం పోసుకోవడం తమకు…