సంక్రాంతి లోపు వరి నాట్లు వేయాలి
పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) రైతులు, పండగ లోపు వరి నాట్లు పూర్తి చేయాలని, పాలకొల్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ సూచించారు. మండలంలోని శివదేవుని చిక్కాల, దగ్గులూరు, బల్లిపాడు, లంకలకోడేరు, ఆగర్రు, గ్రామాల్లో సోమవారం వ్యవసాయ అధికారులు పర్యటించారు. మండలంలో దాళ్వా 9750 ఎకరాల్లో సాగుఅవుతుంది. ఇప్పటివరకు 1650 ఎకరాలలో నాట్లు వేశారు. నీటి కొరత లేకుండా దాల్వాపంట పండించడానికి, ఏప్రిల్ లోపు కోతకు వచ్చేలా రైతులు ప్రణాళిక వేసుకోవాలని కోరారు. ప్రస్తుతం మండలంలో…