Telugu News Power

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి పోటీలు

పాలకొల్లు డిసెంబర్ 17 తెలుగు న్యూస్ పవర్ ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, గణిత పోటీల్లో పాల్గొనడం సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యం అలవాడతాయన్నారు. గణిత జ్ఞానం అందరికీ ఎంతో అవసరం అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణిత సుడోకో, మ్యాజిక్ స్క్వేర్ అనే అంశం మీద పజిల్స్ పోటీలు నిర్వహించారు. ఈ…

Read More

పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక గ్రేడుతో ప్రజలకు మేలు-మాజీఎమ్మెల్సీఅంగర

పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్). పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక గ్రేడు మున్సిపాలిటీగా వర్గోన్నతి పొందటం, పాలకొల్లు పట్టణ ప్రజలందరికీ ఒక మంచి రోజుని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి వాటిని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. ఇందువల్ల మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు చేయటానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు. మంచినీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు పెంచుకోవడానికి ఈ మార్పు ఉపయోగపడుతుందన్నారు. మున్సిపాలిటీ నూరేళ్ల తర్వాత…

Read More

అత్యంత శక్తివంతమైన మహిళ ఉపాసన

పాలకొల్లు:డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) కొణిదల ఉపాసనకు వ్యాపారంలో అత్యంత శక్తివంతమైన మహిళ అవార్డు వరించింది. వ్యాపారంతో పాటు,సామాజిక సేవవలో వీరు చేసిన,చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్ఈ ఈ అవార్డు ప్రకటించింది. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్లో అభిమానులతో ఈ సంతోషాన్ని పంచుకున్నారు. హృదయపూర్వకంగా ఈ అవార్డు స్వీకరిస్తున్నట్టు ఆమె తెలిపారు. అయితే తాను నెలలు మోస్తున్నందున, ప్రత్యక్షంగా ఈ అవార్డు స్వీకరించలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు….

Read More

నారుమడులు త్వరగా వేయాలి

వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ పాలకొల్లు,డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) రైతులు దాళ్వా వరి నారుమళ్ళు వెంటనే వేయాలని వ్యవసాయ సహాయ సంచారకులు మురళీకృష్ణ రైతులకు సూచించారు. పాలకొల్లు సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ 90 శాతం నారు మళ్ళు ఇంకా వేయవలసి ఉందన్నారు. ఈ సబ్ డివిజన్లో గల పాలకొల్లు మండలం లో 4198 హెక్టార్లు , పోడూరు మండలంలో 5708 హెక్టార్లు, ఆచంట మండలంలో 4259 హెక్టార్లలో వరిసాగు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయా…

Read More

నేడే నేషనల్ పెన్షనర్స్ డే

పాలకొల్లు:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) రాజ్యాంగం లోని ఆర్టికల్ 14 అనుసరించి,1982 డిసెంబర్ 17న గౌరవనీయ భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పురస్కరించుకొని ప్రతి ఏటా పింఛనుదారుల ఈ దినోత్సవం జరుపుకుంటారు. ఇందుకు, డి ఎస్ నకార చేసిన పోరాట ఫలితంగా పెన్షనర్స్ కు హక్కులు లభించాయి. జస్టిస్ వై వి చంద్రచూడ్ తన తీర్పులో, పెన్షన్ అనేది విశ్రాంత ఉద్యోగికి పెట్టే బిక్ష కాదని, అది వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన, విధిగా చెల్లించవలసి…

Read More

పాలకొల్లు ఇక ప్రత్యేక మునిసిపాలిటీ

పాలకొల్లు:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు మున్సిపాలిటీ అతి పురాతనమైనది. ఈ మున్సిపాలిటీ ఏప్రిల్ 4, 1919లో ఏర్పాటు అయింది. మొదటి స్థాయి మున్సిపాలిటీగా 1965లో గుర్తించారు. ఇక ఇప్పుడు, పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక మునిసిపాలిటీ స్థాయికి చేరింది. ఈ మేరకు ప్రభుత్వం అసాధారణ గెజిట్ నోటిఫికేషన్ మంగళవారం జారీ చేసింది. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం 303, ఈనెల 10వ తేదీన చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయ…

Read More

102 నాట్ అవుట్ పెన్షనర్ ఏటుకూరి కృష్ణమూర్తి

డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) గత102 ఏళ్లుగా పింఛన్ తీసుకుంటున్న కురువృద్ధులు ఏటుకూరి కృష్ణమూర్తి. గుంటూరు జిల్లా ఏటుకూరులో వీరు1923 లో జన్మించారు. ఏటుకూరి సీతారామయ్య లక్ష్మీబాయమ్మ వీరి తల్లిదండ్రులు. వీరు 1948లో రెవెన్యూ శాఖలో 37 రూపాయల జీతానికి చేరారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వీరి మొదటి కార్య స్థానం. వీరు 1978 లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యారు. గత 47 ఏళ్లుగా వీరు పెన్షన్ పొందుతున్నారు. ప్రస్తుతం 103వ ఏట అడుగు…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం సిద్ధం

సఖినేటిపల్లి: డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రథోత్సవ ఘట్టానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. దేవస్థానంలో ముందుగా పూజలు నిర్వహించి, మేళతాళాలతో రథం షెడ్డు కు వెళ్లి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి రథాన్ని బయటకు తీసుకువచ్చారు. ఇకనుండి రథోత్సవం వరకు రథాన్న శుభ్రం చేయటం, అలంకరించడం వంటి పనులు చేపడుతారు. ఊరేగింపుకు రథాన్న సంసిద్ధం చేస్తా మనీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్…

Read More

రైతుకు తీరని కష్టం,సార్వ పంట నష్టం.

యమంచిలి:డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు వల్ల సార్వపంట దారుణంగా దెబ్బతింది. రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దిగుబడి దారుణంగా తగ్గిపోయింది. క్రాప్ కటింగ్ శాంపుల్స్ లో ఎకరానికి 14 నుంచి 22 బస్తాల దిగుబడి నమోదయింది. వాస్తవానికి ఎక్కడ 20 బస్తాల దిగుబడి వచ్చిన రైతులు లేనే లేరని వారే చెబుతున్నారు. గింజ పాలు పోసుకునే కీలక సమయంలో అకాల వర్షాలు గింజ తాలుగా…

Read More

అమరజీవికి నివాళి

పాలకొల్లు:డిసెంబర్,15 (తెలుగు న్యూస్ పవర్) అమరజీవి,భాష ప్రయుక్త రాష్ట్రాల సృష్టికర్త పొట్టి శ్రీరాములు వర్ధంతి సోమవారం జరిగింది. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల తెలుగు మరియు చరిత్ర శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు శాఖాధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన శరీరం క్రిములకు ఆహారమైపోయినా, లెక్కచేయక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన ధన్యజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు….

Read More