పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక గ్రేడుతో ప్రజలకు మేలు-మాజీఎమ్మెల్సీఅంగర
పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్). పాలకొల్లు మున్సిపాలిటీ ప్రత్యేక గ్రేడు మున్సిపాలిటీగా వర్గోన్నతి పొందటం, పాలకొల్లు పట్టణ ప్రజలందరికీ ఒక మంచి రోజుని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు బలోపేతం చేయడానికి వాటిని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. ఇందువల్ల మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులు చేయటానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయన్నారు. మంచినీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులు పెంచుకోవడానికి ఈ మార్పు ఉపయోగపడుతుందన్నారు. మున్సిపాలిటీ నూరేళ్ల తర్వాత…