
అంతర్వేది:ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్) నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన, స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానములో, ఈనెల 12న
హుండీలు తెరచి లెక్కించారు. ఈ ఆదాయం 36 రోజులకుగాను (08-07-2026 నుంచి 12-08-2026 వరకు)
ప్రధాన ఆలయ హుండిల ద్వారా రూ.20,34,992లు
గుర్రలక్క అమ్మవారి హుండీ రూ.12,698లు
అన్నదానం హుండిల ద్వారా రూ.38,026లు, వెరశి
రూ. 20,85,716లు ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమము దేవదాయశాఖ అమలాపురం , తనిఖీదారు జే. రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో, ఆలయ అసిస్టెంట్ కమీషనర్ ఎం .కే .టి .ఎన్ .వి ప్రసాద్,దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టి. నాగవిష్ణు, ఆలయ సిబ్బంది,స్థానిక ఎంపీటీసీ, బైరా నాగరాజు సమక్షంలో హుండీలు తెరచి లెక్కించారు.