పాలకొల్లు:ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత 80 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వర, దాసాంజనేయ ఆలయంలో స్వామివార్లకు త్రివర్ణ పతాక ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రావణ శనివారం, స్వాతంత్ర పర్వదినం కలిసి రావటంతో భక్తులు, దైవభక్తితో మిళితమైన దేశభక్తి ప్రబోధమైన, ఈ అపురూపమైన దివ్యాలంకరణ చూడటానికి భక్తులు పోటెత్తారు. స్వామి వార్ల అనుగ్రహ దర్శనంతో భక్తి భావంతో తరించారు. నా ప్రధాన అర్చకులు, దేశం సుభిక్షంగా ఉండాలని, దేశ రక్షణ కోసం నిరంతరం భరతమాత సేవలో నిమగ్నమైన జవానులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు దైవం ప్రసాదించాలని ప్రార్థనలు చేసినట్టు తెలిపారు.
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దాసాంజనేయ స్వామికి త్రివర్ణ అలంకరణ.