
పాలకొల్లు, జూన్, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతులు ప్రభుత్వ అనుమతులు తీసుకుని, ఆధునిక పద్ధతిలో రొయ్యల సాగు చేసి లాభాలు పొందాలని జాయింట్ కలెక్టర్ రాహు కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ, ఎంపెడా సంయుక్తంగా నిర్వహించిన రొయ్యల రైతుల అవగాహన కార్యక్రమానికి వివాహం కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రొయ్యల క్షేత్రం నమోదు, నాణ్యమైన రొయ్య పిల్లల సేకరణ పై రైతులకు అవగాహన కార్యక్రమం స్థానిక ట్రిపుల్ ఎస్ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, అంతర్జాతీయ మార్కెట్లో పోసి పడటం గురించి వివరించారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించడం పై అవగాహన కలిగించారు. ప్రతి ఒక్కరు రొయ్యల క్షేత్రాన్ని ప్రభుత్వం వద్ద నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రొయ్యల రైతుల సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు రైతుల సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. గోపాల్ ఆనంద్,
టి శ్రీనివాస్, ప్రొఫెసర్ టి సుగుణ, ఆక్వా రైతులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.