హైదరాబాద్: మే, 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్)సనత్‌నగర్ బాలుడి దారుణ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష పడేలా పకడ్బందీగా ఆధారాలు సేకరించి, కోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన పోలీస్, ప్రాసిక్యూషన్ బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు సన్మానించారు.ఈ శిక్ష ఖరారులో కీలక పాత్ర పోషించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వి. రామకృష్ణారావు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముత్తు యాదవ్, సనత్ నగర్ ఎస్‌హెచ్‌ఓ అశోక్, ఎస్‌ఐ అబ్దుల్ హయ్యుమ్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ శేఖర్‌లను అభినందించారు.నేరస్థులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ ఉరిశిక్ష తీర్పు మరోసారి నిరూపించింది. ఇలాంటి పాశవిక చర్యలకు పాల్పడే వారికి ఈ తీర్పు ఒక బలమైన హెచ్చరిక. ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ ద్వారా ప్రతి కేసును పర్యవేక్షిస్తూ బాధితులకు అండగా ఉంటామని అధికారులు తెలిపారు. ఈ క్రూరమైన ఘటన
2023 ఏప్రిల్‌లో జరిగింది. ఈ ఘాతుకం సమాజం తలదించుకునేలా చేసింది. కేవలం రూ.1 లక్ష అప్పు తిరిగి చెల్లించలేదనే కోపంతో, నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ 8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేశాడు. తన నివాసంలోనే ఆ పసివాడిని అత్యంత క్రూరంగా గొంతు నులిమి చంపేశాడు.
నేరం చేసిన అనంతరం, నిందితుడు తన స్నేహితుడు రఫీక్ సాయంతో మృతదేహాన్ని ఒక బకెట్‌లో కుక్కి, సాక్ష్యాధారాలు దొరకకుండా సమీపంలోని నాలాలో పడేశాడు.
ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్ కు ఉరి శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధించింది. అలాగే కిడ్నాప్ కింద యావజ్జీవ శిక్ష, సాక్ష్యాధారాల ధ్వంసం కేసులో మరో 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. రెండో నిందితుడైన మహమ్మద్ రఫీక్‌కు సాక్ష్యాధారాలు ధ్వంసం చేసినందుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
నిందితుడికి ఉరిశిక్ష వేయించిన పోలీసు బృందానికి సత్కారం.
సత్కారం అనుకున్న పోలీసు బృందంతో ఉన్నతాధికారులు