Skip to main content

Telugu News Power

అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

ఏనుగువానిలంక గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నిమ్మల

యలమంచిలి: ఫిబ్రవరి, 28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక సభ్యులు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎలమంచిలి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. కలగంపూడి వద్ద కాలువకు సిమెంట్ గోడ నిర్మాణానికి 54 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఏనుగువానిలంకలో ఆసుపత్రి భవన నిర్మాణానికి 36 లక్షల రూపాయలు కేటాయించారు. ఏ నువ్వు అలాగా బ్రాంచ్ ఛానల్ వెంబడి రోడ్డు నిర్మాణానికి 74.55
లక్షల రూపాయల, రోడ్లు డ్రైనేజీ పనులకు 15 లక్షల రూపాయలతో పనులు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు కూటమినాయకులతో శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, నర్సాపురం టిడిపి ఇన్చార్జ్ పాత్తూరి రామరాజు, నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి చిన్ని, కడలిగోపాల రావు, మామిడిశెట్టి పెద్దిరాజు, బొప్పన హరి కిషోర్, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.