Skip to main content

Telugu News Power

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వివరాలు.

ఈ నెల 21 నుంచి 23 వరకు ఆయా మండలాల ఎంపీడీఓ కార్యాలయం లో ఉదయం గం. 9ల నుంచి సాయంత్రం గం.5 ల వరకు నామినేషన్లు తీసుకొంటారు. నామినేషన్ల పరిశీలన 24న జరుగుతుంది.
నామినేషన్ ఫారం లో ఏమైనా తప్పిదాలు జరిగి తిరస్కరించిన, నామినేషన్లపై 25న అప్పిలు చేసుకోవాలి.
నామినేషన్ల తిరస్కరణ పై 26న ఎన్నికల అధికారి తుది నిర్ణయం ప్రకటిస్తారు.
నామినేషన్ల ఉపసంహరణ కు 27 వరకు గడువు ఇచ్చారు.
ఎంపీటీసీ,జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయు అభ్యర్థుల పేర్లు 27సాయంత్రం, ఎన్నికల అధికారి ప్రకటిస్తారు.
పోలింగ్ నవంబర్, 3న జరుగుతుంది.
రీపోలింగ్ అవసరమైన చోట 4న ఎన్నికల అధికారి అనుమతితో నిర్వహిస్తారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు 5న జరుగుతుంది. ఆ వెంటనే ఫలితాల ప్రకటన, గెలిచిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రం అందజేస్తారు.