పాలకొల్లు:అక్టోబర్,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో, చెరుకూరి బుద్దావతారం రాజు మెమోరియల్, ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ క్వాలిఫైయింగ్ పోటీలు శుక్ర శనివారాల్లో జరిగాయి. ఈ పోటీలకు సింగిల్స్ విభాగంలో 96 మంది, డబుల్సు కు 48 మంది ఎంపికైనట్టు టోర్నమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ గొట్టుముక్కల శ్రీ వెంకట రామ సూర్యనారాయణ రాజు (బూన్ రాజు) శనివారం పత్రికలకు వెల్లడించారు. క్రీడాకారులు 45 ఏళ్ల నుంచి 75 ఏళ్ళ వయసు వరకు ఉన్న, తలపండిన వారు కూడా ఈ పోటీల్లో తలపడతారు. ప్రధాన పోటీలు,నరసాపురం ఆఫీసర్స్ క్లబ్, పాలకొల్లు టౌన్ హాల్, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏకకాలంలో జరుగుతాయి. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు ఆదివారం సాయంత్రం ఈ పోటీలు ప్రారంభిస్తారు. ఈ టోర్నమెంట్ చైర్మన్, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, డైరెక్టర్, వివి సోమరాజు, డాక్టర్ వర్మ, కెవి కృష్ణ వర్మ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
కాస్మో కల్చరల్ స్పోట్స్ క్లబ్, సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలకు సింగిల్స్ కు 96t మంది, డబుల్స్ కు 48 మంది ఎంపిక.
నర్సాపురంలో క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఆడుతున్న దృశ్యం