Skip to main content

Telugu News Power

ఆక్వా రైతులకు త్వరలోనే విద్యుత్ సబ్సిడీ అమలు. -విద్యుత్ శాఖ మంత్రి హామీ.

మంత్రి నిమ్మల సమక్షంలో విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ కు వినతి పత్రం అందిస్తున్న గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బృందం

అమరావతి: జూలై 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా సంఘ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బృందం, గురువారం పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జలవణుల శాఖ మాత్యుల ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ ను గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆక్వారైతులకు భే షరతుగా విద్యుత్ సబ్సిడీ అందరికీ అందేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతుల సమస్యను రావుగాహన చేసుకున్న మంత్రి గొట్టిపాటి వారి రోజుల్లో ఆక్వా రైతులకు సబ్సిడీ అమలు చేసేలా ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీడి జాన్ డేవిడ్ రాజు, సత్తి బాబు రాజు, సత్తినీడి నాని, కాకర్ల వినాయక, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.