పాలకొల్లు:జూన్ 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని వైసీపీ నాయకుడు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వెలగ శ్రీరామమూర్తి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు నిర్మాణానికి సంబంధించి మేక శేషుబాబు కుటుంబసభ్యులు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మా అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని బాధితుడు వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయ్యి మళ్లీ ఇటీవల పార్టీలోచేరిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు చేతిలో రూ. 7 కోట్ల వరకు మోసపోయామని, ఫోర్జరీ సంతకాలతో తమను మోసగించారని శ్రీరామమూర్తి ఆరోపించారు. ఈ విషయంలో న్యాయం జరగకపోతే చావే శరణ్యం అంటూ మీడియా ముందు ఆందోళన వ్యక్తంచేశారు. ఏలూరు జిల్లా గోపాలపురం మండలం కోమటికుంట గ్రామానికి చెందిన వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు వెలగ శ్రీరామ మూర్తి తనను శేషు బాబు వ్యాపారం పేరుతో నమ్మించి, ఫోర్జరీ సంతకాలు చేసి మోసం చేశాడని ఆరోపించారు. శేషుబాబు కుటుంబ సభ్యులైన భార్య శశికళ, మామ తల్లాడ సత్యనారాయణ (సత్తిపండు ), బావమరిది తల్లాడ నేతాజీ శ్రీనివాస్, తాను కలిసి రైస్ మిల్లును నిర్మాణం చేశామని, ఎండి గా సత్తిపండు, మిగిలిన నలుగురు డైరెక్టర్లుగా ఉన్నామని, మిల్లు నిర్మాణానికి కోటి రూపాయలు సొమ్మును పెట్టుబడి గాను, నాలుగు ఎకరాల పంతొమ్మిది సెంట్లు భూమిని ఇచ్చానని శ్రీరామమూర్తి తెలిపారు. రైస్ మిల్ ప్రారంభించిన మూడు నెలలకు ఎండి అయిన సత్తిపండు మృతి చెందగా, ఆ స్థానంలో శేషుబాబు వచ్చి మిల్లు వ్యవహారం మొత్తాన్ని చూసుకుంటున్నారని. రైస్ మిల్లులో తాను పెట్టిన పెట్టుబడులకు, లాభాలకు సంబంధించి తనకు సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు రావలసిన సొమ్మును అడుగుగా, ఎగ్గొట్టేందుకు తనకు తెలియకుండా తన సంతకాలను శేషుబాబు పోర్జరిచేసి డైరెక్టర్ పదవిని తనకు తెలియకుండా తొలగించారని, మెయిల్ ఐడిని సైతం మార్చేశారని బాధితుడు శ్రీరామమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి గతంలో శేషుబాబుపై గోపాలపురం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారుగాని విచారణ మాత్రం ముందుకు వెళ్లలేదని, దీంతో హైకోర్టును ఆశ్రయించగా విచారణకు ఆదేశించినప్పటికీ, ఎటువంటి పురోగతి లేదన్నారు. రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు జరగగా, రెండు టన్నుల వరకు పిడిఎస్ బియ్యం నిల్వలు దొరకడంతో కేసు నమోదు అయిందని, ఈ కేసులో మొదట మా ఐదుగురు డైరెక్టర్లపై కేసు నమోదు చేసి, రెండేళ్లు రైస్ మిల్లును సీజ్ చేయమని రాజమండ్రి జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని, శేషుబాబు పరపతిని ఉపయోగించి రైస్ మిల్లు మూతపడకుండా నిలుపుదల చేయించి, అతని పేరుతో పాటు అతని కుటుంబ సభ్యుల పేర్లను కేసు నుండి తొలగించుకుని అక్రమంగా నాపై, మా సోదరుల పై కేసు నమోదు చేయించారని. తమకు జరిగిన అన్యాయంపై శేషుబాబును నిలదీయగా రైసుమిల్లుకు తనకి ఎటువంటి సంబంధం లేదంటూ బయటికి గెంటేసాడని , తనకు రావలసిన ఏడు కోట్ల రూపాయలను ఇవ్వకుండా మోసం చేశారని శ్రీ రామ్మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు అడుగుతుంటే తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ శేషుబాబు బెదిరిస్తున్నాడని, పోలీసులు నా చేతిలో ఉన్నారు నన్ను ఎవరు ఏమి చేయలేరు అంటూ మాట్లాడుతున్నాడని, తనకు న్యాయం చేయమని పోలీసులను, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను కోరుతున్నప్పటికీ, ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదని శ్రీరామ మూర్తి మీడియాకు వెల్లడించారు. అదేవిధంగా రైస్ మిల్లు నిర్మాణానికి సంబంధించి యంత్రాలను బిగించే పనులకు రూ.60 లక్షలు వరకు శేషుబాబు ఇవ్వాలని, బిక్కవోలు గ్రామానికి చెందిన ఎల్లాజీరావు అనే కార్మికుడు తన భార్యతో సహా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డబ్బులు ఇస్తామని చెప్పి పని చేయించుకొని పూర్తయిన తర్వాత అడుగుతుంటే పట్టించుకోవడంలేదని , పనికి సంబంధించి తాను అప్పులు చేసి ఇతర కార్మికులకు జీతాలు చెల్లించానని ఆ డబ్బులకు వడ్డీలు కట్టలేకపోతున్నానని, తనకు రావలసిన డబ్బులు ఇవ్వకపోవడం వలన కుమార్తె వివాహము ఆగిపోయిందని ఎల్లాజీరావు మీడియా ముందు తన ఆవేదనను వెల్లడించారు. శేషుబాబుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన పట్టించుకోవడం లేదన్నారు. శేషుబాబు చేతిలో మోసపోయిన బాధిత కుటుంబాలు తమకు రావలసిన డబ్బులు ఇవ్వకపోతే చావే సారణ్యం అంటున్నారు. ఇప్పటికైనా మా ఆవేదనను అర్థం చేసుకొని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. శేషుబాబు సొంత ఊరు ఆగర్తిపాలెంలో అతని బంధువులైన భార్యాభర్తలు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ లైవ్ వీడియోలో శేషుబాబుతో పాటు అతను కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి పాయిజన్ తీసుకొని మృతి చెందిన సంఘటన సోషల్ మీడియాలో గతంలో వైరల్ అయిన ఘటనను బాధితులు గుర్తు చేశారు. మీడియా సమావేశంలో ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ కోశాధికారి నుదురుపాటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బొమ్మ హేమ సాయిబాబా, పాలకొల్లు చినగోపురం దేవస్థానం చైర్మన్ రేపాక ప్రవీణ్ భాను, మాజీ చైర్మన్ గాది వెంకన్న, ఆర్యవైశ్య సంఘ నాయకులు గాది సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు బెదిరింపులు. రైస్ మిల్లు వ్యవహారంలో ఏడు కోట్లు ఎగవేత.
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీరామమూర్తి