Telugu News Power

ఈతలో రికార్డు సృష్ఠింన 7 ఏళ్ళ బాలుడు.

చరిత్ర సృష్టించిన బాల ఈతగాడు ఇషాంక్
పాక్ జలసంధి ఈదుతున్న ఇషాంక్

రాంచి: మే 1: ఝార్ఖండ్‌లోని రాంచి నివాసి 7 ఏళ్ల ఇషాంక్ సింగ్ అనే బాలుడు అసాధారణ సాహసం ప్రదర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్ఫాడు. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడు ధనుష్కోడి వరకు 29 కిలోమీటర్ల పాక్ జలసంధి (పాల్క్ స్ట్రెయిట్‌)ని దాటాడు. ఈ జలసంధిని 9 గంటల 50 నిమిషాల్లో ఈది సరికొత్త రికార్డు
రికార్డు సృష్ఠించాడు. గత నెల
30న, జరిగిన ఈ ఈత ప్రదర్శనకు యూనివర్సల్ రికార్డ్స్ ఫోరం (యూఆర్ఎఫ్) అధికారికంగా ధృవీకరించింది. ఇంతకు ముందు ఈ రికార్డు 10 ఏళ్ల జయ్ జాష్వంత్ (10 గంటల 30 నిమిషాలు, 2019) పేరు మీద ఉంది. అత్యంత పిన్న వయసులో,అమిత వేగంగా ‘(యంగెస్ట్ అండ్ ఫాస్టెష్ట్ ) పాక్ జలసంధి దాటిన ఈతగాడుగా చరిత్రలో స్థానం సంపాధించాడు.
పాక్ జలసంధిలో బలమైన ప్రవాహాలు ఉంటాయి. భారతదేశం వైపు ఈ సమస్య ఇంకా ఎక్కువ. అలలు ఈతగాళ్ళను వెనుకకు,ముందుకు నెడుతూ అవరోధం కలిగిస్తాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయి. జలచరాల ప్రమాదం ఎటూ పొంచి ఉండనే ఉంటుంది.అత్యంత ప్రమాదకరమైన వాతావరణంతో, ఇప్పటికీ అనుభవజ్ఞులైన స్విమ్మర్లకుకూడా సవాలుగా నిలుస్తుంది ఈ జలసంధి. ఈ బాలుని శిక్షణ కూడ ఆసక్తికరమైనది. రాంచిలోని ధుర్వా డ్యామ్‌లో రోజూ 4-5 గంటలు ఇషాంక్ సాధన చేసేవాడు. జవహర్ విద్యా మందిర్ (డిఏవి,శ్యామలి)లో ఇతను 3వ తరగతి విద్యార్థి. కోచ్‌లు అమన్ కుమార్ జైస్వాల్, బజ్రంగ్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ సాధన పూర్తి చేశాడు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ సాధనను ప్రశంసించారు.