అమరావతి: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్)భారత్ నారి శక్తి ఖండాంతరాలలో తమ సత్తా చాటుతున్నది. భారత మహిళలు ప్రతి రంగంలో నారి శక్తి, ఆరోగ్యకరమైన వృద్ధిని సాధిస్తున్నది.ఈ జాతీయ మార్పును ప్రతిబింబించేలా, ఆర్ వైశాలి సైప్రస్‌లో గురువారం
ఎఫ్ ఐ డి ఇ- అంతర్జాతీయ ఛెస్ ఫెడరేషన్ నిర్వహించిన చెస్ పోటీల్లో చరిత్ర సృష్టించారు. మహిళల వరల్డ్ ఛెస్ చాంపియన్‌షిప్‌కు సవాలు విసిరే స్థాయికి ఎదిగిన మొదటి భారతీయ మహిళగా ఆమె చెస్ చరిత్ర లో సువర్ణాక్షరాలతో లిఖించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా, రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము నుంచి పీవీ సింధు వంటి ఒలంపిక్ క్రీడాకారుల వరకు ఎందరో మహిళలు ఈ దేశ ప్రతిష్టను ఇనుముడింప చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళా బిళ్ళు ఆమోదం పొందటానికి ఎన్ డి ఏ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇందువ ల్ల మహిళా శక్తి పాత్ర మరింతగా దేశాభివృద్ధికి కోప్పడుతుందన్నారు.
సైప్రస్ చెస్ పోటీల్లో చరిత్ర సృష్టించిన వైశాలి. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు.
చెస్ ప్రపంచంలో చరిత్ర సృష్టించిన వైశాలి