పాలకొల్లు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్)రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ టీం లో కర్రి రవితేజ పశ్చిమగోదావరి జిల్లా నుంచి చోటు దక్కించుకున్నారు. ఇతను ఉల్లంపర్రు మాంటిసోరి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ సందర్భంగా పాఠశాలలో రవితేజకు అభినందన సభ శనివారం జరిగింది. ముఖ్య అతిధి ఎంఈఓ గుమ్మళ్ళ వీరాస్వామి మాట్లాడుతూ, క్రీడలు శారీరిక దారుడ్యం, ఆరోగ్యం ఇస్తాయన్నారు. ఇందువల్ల విద్యార్థులకు పోటీతత్వాన్ని ఎదుర్కొనే మానసిక బలం వస్తుందన్నారు. రవితేజ భవిష్యత్తులో మంచి క్రీడాకాడు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించే భాగంగా బాస్కెట్ బాల్ కోర్టు పాఠశాల ఆవరణలో నిర్మించినట్లు కరస్పాండెంట్ మద్ధాల రాంప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాస్కెట్ బాల్ సంఘం అధ్యక్ష్యులు మద్దాల వాసు, ప్రిన్సిపల్ ఎస్. వసంత లక్ష్మి, రేలంగి రామకృష్ణ, కర్రి కృష్ణా రెడ్డి, సత్తి సుబ్బన్న రెడ్డి పాల్గొన్నారు.
రవితేజకు బాస్కెట్ బాల్ లో చోటు.