Skip to main content

Telugu News Power

ఎన్ సి ఇ ఆర్ టి పై కన్నెర్ర చేసిన భారత అత్యున్నత న్యాయస్థానం.

నూతన సిలబస్ లో నిషేధానికి గురైన పాఠ్యాంశం

న్యూఢిల్లీ: ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) దేశ అత్యున్నత న్యాయస్థానం, భారతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పై కన్నర్రజేసింది. ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నూతనంగా తీసుకువచ్చిన 8వ తరగతి పాఠ్యాంశం అత్యున్నత న్యాయస్థానానికి ఆగ్రహం తెప్పించింది. ఇందుకు కారణం, న్యాయ వ్యవస్థలో అవినీతి అనే అంశంపై ఉన్న విషయం ప్రచురించడం గురించి. అత్యున్నత న్యాయస్థానం, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, ఏమాత్రం వెసులుబాటు లేని సమగ్ర నిషేధం (బ్లాంకెట్ బ్యాన్) విధించింది. అమ్ముడు పోయిన పుస్తకాలతో సహా అన్నిటిని వెనక్కు రప్పించాలని ఆదేశించింది. డిజిటల్ రూపంలో ఉన్న పుస్తక కాపీలు కూడా వాడకుండా నిషేధించారు. ఇది న్యాయ వ్యవస్థ పై ఉన్న నమ్మకాన్ని ప్రజలలో పలుచన చేస్తుందని కోర్టు అభిప్రాయ పడింది. ప్రధాన న్యాయమూర్తి, సూర్యకాంత్, బాధ్యులు ఎవరో తేలే వరకు, కేసు వదిలిపెట్టబోమని వెల్లడించారు.