
ఆత్రేయపురం: ఆగస్టు, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వాడపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు బుధవారం జరిగింది. స్వామివారి హుండీలు ఐదు వారాలకు తెరిచారు. నగదు రూపంలో 2 కోట్ల 97 లక్షల 95 వేల 992 భక్తులు కానుకగా సమర్పించారు. ఇందులో 15 దేశాల నుంచి భక్తులు పంపిన విదేశీ కరెన్సీ అదనం. వెండి1.24 కే జి లు, బంగారం18.900 గ్రాములతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు( గబ్బర్ సింగ్), అసిస్టెంట్ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్ రావు, శిష్టాల కోటేశ్వరావు, వి.సుందర శేషావతారం, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ అధికారులు, సేవకులు, ఈ కార్యక్రమానికి సహకరించారని ఈ ఓ తెలిపారు.
