పాలకొల్లు: మార్చి, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్)
అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో, రాష్ట్ర జలళనరుల శాఖామంత్రి, స్థానిక ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు సూచనల మేరకు,ఏనుగు వాని లంక గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. రైతులకు వారి పశువులకు సంబంధించిన మందులు ఉచితంగా పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయ భాస్కర్, వైస్ చైర్మన్ దాసరి రత్నం రాజు, ఏఎంసి డైరెక్టర్ బిట్టా లక్ష్మీనారాయణ, ఏనుగువానిలంక సొసైటీ చైర్మన్ ఇనుకొండ వెంకటేశ్వరరావు, గ్రామ అధ్యక్షుడు ముచ్చర్ల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఈధా సువర్ణ రాజు,ఎంపిటిసి ఇంటి బాబు రావు, షేక్ వలి,
ఇనుకొండ రమేష్ ,కూటమి నాయకులు మరియు రైతులు, పశు వైద్య అధికారి, తదితరులు పాల్గొన్నారు.
ఏనుగువానిలంకలో పశువైద్య శిబిరం.
పశు వైద్య శిబిరం ప్రారంభిస్తున్న కోడి విజయ భాస్కర్