పాలకొల్లు: అక్టోబర్, 16
(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కారుమూరి వారి వీధిలో గల సాయి కృష్ణ మెడికల్ ఏజెన్సీస్ సంస్థ పై గురువారం ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగినట్టు శుక్రవారం తెలిపారు. ఏటా ఈ తనిఖీలు నిర్వహించవలసి ఉంటుందన్నారు. ఏజెన్సీ వద్ద నిక్షిప్తం చేసిన సమాచారాన్ని(డేటా ఎంట్రీ) పరిశీలించామన్నారు. సదరు సమాచారాన్ని తమ శాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఈ తణిఖీల్లో భీమవరం ఔషధ నియంత్రణ అధికారి మల్లికార్జున రావు, వారి సిబ్బంది పాల్గొన్నారు. గతంలో ఈ ఏజెన్సీ పై సేవా ట్రస్ట్ పేరుతో తీసుకున్న ఔషధాలును మార్కెట్లో విక్రయాలకు పాల్పడటం, తదితర ఆరోపణలు ఉన్న కారణంగా, ఈ తనిఖీలు నిర్వహించినట్టు వెల్లడించారు.
ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు.