భీమవరం: అక్టోబర్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు దేవి శరన్నవరాత్రులలో భాగంగా శ్రీ అమ్మవారు సరస్వతి దేవి గా భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ విద్యార్థులకు సరస్వతీ పూజ కార్యక్రమం నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులకు పుస్తకం పెన్ను,ఆలయ చైర్మన్, బొండాడ నాగభూషణం ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఉదిసి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, గుసిడి శిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో మేజిక్ షో నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ తెలిపారు.
శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో అనుగ్రహ దర్శనం.
సరస్వతి పూజలో పాల్గొన్న విద్యార్థులు