Telugu News Power

కూటమి ప్రభుత్వంలో 27 వేల కిలోమీటర్ల రహదారులకు మోక్షం. -ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

మంత్రులకు గజమాలతో ఘన స్వాగతం
శ్రీ దేశాలమ్మ ఆశీస్సులు అందుకుంటున్న మంత్రులు

పాలకొల్లు: మే 19, (తెలుగు న్యూస్ పవర్. కామ్)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 27 వేల కిలోమీటర్ల రోడ్లు వేసినట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మాత్యులు బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. స్థానిక నియోజకవర్గ పరిధిలో రూ.12.90 కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు అనిత శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జనార్ధన రెడ్డి, మాట్లాడుతూ, జిల్లాకు రోడ్ల అభివృద్ధి కోసం 250 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు వెల్లడించారు. నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయల నిధులు రోడ్ల అభివృద్ధికి కేటాయించినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం నాయకులను అన్యాయంగా జైల్లో ఇరికించిందని విమర్శించారు. రాష్ట్రంలో పోలవరం అంటే, ముఖ్యమంత్రి తర్వాత గుర్తొచ్చేది మంత్రి నిమ్మల రామానాయుడు అని పేర్కొన్నారు. రైతులకు సాగునీటి సరఫరా సక్రమంగా జరగటానికి మంత్రి ముందస్తు ప్రణాళికే కారణం అన్నారు. నిధుల కూరతో ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. నిరుద్యోగులకు 16 వేల ఉపాధ్యాయ పోస్టులు, 6వేల కానిస్టేబుల్ పోస్టులు, ఇప్పటికే భర్తీ చేశామన్నారు. విద్యాశాఖ మాత్యులు లోకేష్ ప్రభుత్వ పాఠశాలను, ప్రైవేటు పాఠశాలల కంటే గొప్పగా తీర్చిదిద్దారన్నారు. సభకు అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ప్రపంచ ప్రఖ్యాత అమరావతి, ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుల పనులు సరదాగా జరుగుతున్నాయన్నారు. నరకానికి ఆనవాళ్లుగా మారిన గుంతల రోడ్లలో పడి ఎందరో మరణించారని విచారం అర్థం చేశారు. అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత పాలకొల్లు వైసీపీ నేతలకు లేదని ఉద్ఘాటించారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖామాత్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ మూతపడకుండా, రూ. 11,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని తెలిపారు. మరోసారి ప్యాకేజీ ఇవ్వటానికి కూడా కేంద్రం సుముఖంగా ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనైనా నిధుల కొరత ఉండవచ్చునేమో గాని పాలకొల్లు మాత్రం నిధుల కొరత లేదని తెలిపారు. తమ నాయకులను అడిగిన అన్ని మీ ఎమ్మెల్యే గానే చూసుకుంటారని తెలిపారని వెల్లడించారు. గతంలో కోడిగుడ్లు మీద కూడా బొమ్మ వేయించుకున్న ముఖ్యమంత్రి ప్రపంచం లో ఎవరూ లేరన్నారు. అనేక రకాలుగా గత ప్రభుత్వం నిధులు దివ్య యోగానికి పాల్పడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, రాష్ట్ర టిడిపి నాయకులు పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, బొప్పన హరి కిషోర్, మామిడి శెట్టి పెద్దిరాజు బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్ది, జనసేన నాయకులు బోనం చినబాబు కొల్లి కొండ ప్రసాద్ తులా రామలింగేశ్వర రావు జక్కంపూడి కుమార్, ఇంటి శ్రీరాముడు, ఆర్టీవో దాసిరాజు, ఆర్ అండ్ బి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ దేశాలమ్మ వారి జాతర సందర్భంగా మంత్రులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కూటమి శ్రేణులు, మహిళలు విశేషంగా పాల్గొని అపూర్వ స్వాగతం పలికారు.