Telugu News Power

జర్నలిస్టులకు అండగా ఉంటా. -మంత్రి నిమ్మల రామానాయుడు

జర్నలిస్టుల సత్కారం అందుకున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు:,మే,18 తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిస్వార్థ ప్రజాసేవ చేస్తున్న జర్నలిస్టులకు అండగా ఉంటానని, స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వీరి ఆరోగ్య భీమాకు సంబంధించి
రూ.1250 లు 26 నంది అర్హులైన జర్నలిస్టులకు మంత్రి సోమవారం సొమ్ము చెల్లించారు. జీత భత్యాలు లేని, సేవా భావంతో పనిచేసే జర్నలిస్టులు తనకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్ట్ సోదరుల సమస్యలు, తన సొంత సమస్యగా భావించి, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అందరికీ క్యాంపు కార్యాలయం దగ్గర సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో, జర్నలిస్టు నాయకులు, నిన్న కోట వెంకటరమణ, పీ టి వెంకటేశ్వరరావు, తోట రాంబాబు, ఎం ఎన్ వి సాంబశివరావు, పలువురు జర్నలిస్టులు మంత్రిని ఘనంగా సత్కరించారు.