Telugu News Power

పట్టణ మంచినీటి సమస్యపై ఖాళీ బిందెలతో వైసిపి నిరసన.

యడ్ల బండితో నిరసన వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులు

పాలకొల్లు: మే,19 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణంలో మంచినీటి సరఫరా ఇబ్బందులపై వైసీపీ నాయకులు మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వంటి పూట సరఫరా చేస్తున్న మంచినీరు కూడా సక్రమంగా ఇవ్వటం లేదని ఆరోపించారు. ఇందువల్ల మహిళలు నానా అవసాట్లు పడవలసి వస్తుందని, కమిషనర్ పార్థసారథి దృష్టికి తీసుకువచ్చారు. మంచినీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నేలపై కూర్చుని తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గుణ్ణం నాగబాబు, మేక శేషుబాబు, యడ్ల తాతాజీ, నడపను గోవిందరాజులు నాయుడు, చెల్లెమ్మ ఆనంద ప్రకాష్, కర్ర జయ సరిత, మద్ద చంద్రకళ, కోరాడ శ్రీనివాస్, తదితల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు