Telugu News Power

కేంద్ర మహిళా సాధికారత కమిటీ అధ్యక్షురాలిగా డాక్టర్ దగ్గుబాటి. పురందేశ్వరి.

కేంద్ర మహిళా సాధికార కమిటీ అధ్యక్షురాలు పురందరేశ్వరి

లోక్‌సభ స్పీకర్ మహిళా సాధికారత కమిటీ (2026-27)ని అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీకి అధ్యక్షురాలిగా ఆంధ్ర ప్రదేశ్, రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు డాక్టర్ డి. పురందేశ్వరి నియమితులయ్యారు.
లోక్‌సభ సభ్యులు (18 మంది):
డాక్టర్ డి. పురందేశ్వరి, స్మత్. లవ్లీ ఆనంద్, స్మత్. డి.కె. అరుణ, స్మత్. హర్సిమ్రత్ కౌర్ బాదల్, స్మత్. శోభనాబెన్ మహేంద్రసింహ్ బరాయియా, మిస్. ఇక్రా చౌదరి, స్మత్. కృతి దేవి డెబ్బర్మన్, కుమారి ప్రియాంక సతీష్ జార్కిహోలి, డాక్టర్ కాడియమ్ కవ్య, స్మత్. జ్యోత్స్న చరందాస్ మహంత్, స్మత్. హేమ మాలిని, స్మత్. మహిమ కుమారి మేవార్, స్మత్. డెల్కర్ కళాబెన్ మోహన్‌భాయ్, కుమారి సుధా ఆర్., స్మత్. శతాబ్ది రాయ్, స్మత్. హిమాద్రి సింగ్, డాక్టర్ రాణి శ్రీకుమార్, స్మత్. స్మిత ఉదయ్ వాఘ్.
రాజ్యసభ సభ్యులు (10 మంది):
సాగరిక ఘోష్, జెబి మాథర్ హిషామ్, స్వాతి మాలివాల్, సుధా మూర్తి, డాక్టర్ కవిత పాటీదార్, రాజతి, రేఖా శర్మ, పి.టి. ఉష, లక్ష్మి వర్మ, సంగీత యాదవ్.
మహిళా హక్కులు, సాధికారత అంశాలపై ఈ కమిటీ పని చేయనుంది. సాధికార కమిటీ అధ్యక్షురాలు నియమించినందుకు, స్పీకర్ ఓంబిర్లా కు పురందరేశ్వరి కృతజ్ఞతలు తెలియజేశారు.