Telugu News Power

పంచారామం, క్షీరా రామ క్షేత్రం వద్ద భక్తుల ప్రదక్షిణలు.

సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న భక్తులు

పాలకొల్లు: జూన్,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)పంచరామ క్షేత్రం పాలకొల్లులో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం సాయంత్రం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు సప్త ప్రదక్షిణాలు, ఏడు మారేడు దళములతో మాడవీధులలో భక్తులు సుమారుగా 450మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు , ఆలయ ప్రధాన అర్చకుడు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి, కిష్టప్ప , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి శ్రీ స్వామివార్లకు ధూప సేవ, శ్రీ స్వామి వారి పంచ హారతులు సేవ ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగాయి.