Skip to main content

Telugu News Power

క్షీరా రామంలో శంకర జయంతి.

శంకర భగవత్పాదుల వారికి అర్పిస్తున్న ఈఓ ముచ్చర్ల
శంకరాచార్యుల వారికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యం

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ స్వామి వారి కళ్యాణ మండపంలో ఉన్న ఆది శంకరాచార్యుల విగ్రహం వద్ద ఉదయం మండపారాధన, అష్టోత్తరము పూజలు ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్ వారిచే సహస్రనామ, తదితర పూజలు పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు పూలమాలవేసి శంకరాచార్యులు వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు పి వాసు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.