Skip to main content

Telugu News Power

క్షీర రామం లో చండీ హోమం

చండీ హోమం పూజలో పాల్గొన్న భక్తులు, అధికారులు

పాలకొల్లు: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం 9 గంటలకు చండి హోమం జరిగింది. దంపతులు 26 మంది తో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ హోమం, పూజా కార్యక్రమాలు అభిషేక పండిట్ భమిడిపాటి వెంకటేశ్వర్లు నిర్వహించినారు. ఆలయ కార్యనిర్వహణధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ వాసు, అర్చకులు వీరబాబు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.