
భీమవరం: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి గురుపౌర్ణమి సందర్భంగా 6 టన్నుల వివిధ రకముల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు తో శాకంబరి అలంకారంతో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా, నిర్వహించిన చండీహోమం కార్యక్రమంలో 90 మంది దంపతులు పాల్గొన్నారు. గాయత్రి డాన్స్ అకాడమి అత్తిలి డాన్స్ మాస్టర్ పెద్దిశెట్టి గాయత్రి దేవి ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శన, భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు ప్రోత్సాహంతో మహిళ భక్తులచే సౌందర్య లహరి, లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు, రామాయణం శ్రీనివాస్,ఉదీశి మీనాక్షి,అతికెల ఆంజనేయ ప్రసాద్,గుసిడి నాగ శిరీష,కారెంపూడి ఆదిలక్ష్మి,అరసవల్లి బాల సుబ్రహ్మణ్యం,మిర్తిపాటి గున్నేశ్వరరావు,మల్లువలస లక్ష్మి నిర్మల,గొంతిన రమణ,యండ సత్యవతి,ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పాపొలు ఏడుకొండలు పాల్గొన్నారు.
