Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో వరుణ యాగం.

వరుణ యాగానికి హాజరైన ఎమ్మెల్యే అంజిబాబు
వరుణ జపం లో పాల్గొన్న మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి

భీమవరం: అక్టోబర్,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ మావుళ్లమ్మభీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయ శాఖ ఆదేశాలు మేరకు సకాలంలో, సమృద్ధిగా వర్షాలు కురవాలనే సత్సంకల్పంతో వరుణ మంత్ర జపాన్ని మంగళవారం నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే వరుణ మంత్ర జపం పూజ కార్యక్రమం లో భీమవరం శాసన సభ్యులు, పి ఏ సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు . ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వేద పండితులు వేద మంత్రాలతో వరుణ మంత్ర జపం పూజను నిర్వహించారు.జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, ఉపాధ్యాయ ఎంమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, మాజీ రాజ్య సభ సభ్యులు, భీమవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ తోట సీతారామ లక్ష్మి,ఏఎంసి వైస్ చైర్మన్ బండి రమేష్, ఆలయ చైర్మన్ బోండాడ నాగ భూషణం, పాలకవర్గ సభ్యులు రామాయణం శ్రీనివాసరావు, అతికెల ఆంజనేయ ప్రసాద్,కారెంపూడి ఆదిలక్ష్మి,అరసవల్లి సుబ్రమణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు మల్లువలస లక్ష్మి నిర్మల,యండ సత్యవతి,ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు,పాపొలు ఏడుకొండలు, కూటమి నాయకులు, కార్యకర్తలు అభిమానులు,వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.