పాలకొల్లు: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం,లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడుగా
పనిచేస్తున్న కుక్కల వెంకట రాజా సురేష్ మంగళవారం లంకలకోడేరు రైల్వేస్టేషన్ సమీపంలో బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ముగించుకొని, తిరిగి ద్విచక్ర వాహనం పై ఇంటికి బయలుదేరారు.భగ్గేశ్వరం గ్రామం వంతెన వద్దకు వచ్చేసరికి పూర్వ విద్యార్థి దారికాచి, ఆకస్మాత్తుగా దాడి చేసి తలపై ఇనుపరాడ్ తో కొట్టాడు. ఈ ఘటనలో గాయపడ్డ కుక్కల వెంకట రాజా సురేష్ ను పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, బుధవారం పరామర్శించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. ఆసుపత్రి వైద్యులు, సురేష్ ఆరోగ్యం గురించి తెలియజేశారు.
గాయపడ్డ ఉపాధ్యాయునికి ఎమ్మెల్సీ పరామర్శ.
పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు సురేష్ ను పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ బొర్రా గోపి