Skip to main content

Telugu News Power

చాంబర్స్ కళాశాలకు కాస్మో క్లబ్ రూ. 10 లక్షల విరాళం.

గాంధీభగవాన్ రాజును సత్కరిస్తున్న చాంబర్స్ కళాశాల యాజమాన్యం.
ఫ్రెషర్స్ డే సంబరాలు

పాలకొల్లు: అక్టోబర్,10
(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ వారు, ఛాంబర్స్ కళాశాలకు రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. చాంబర్స్ కళాశాల తాజా విద్యార్థుల స్వాగతోత్సవ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి, కళాశాల అధ్యక్షులు, కె.వి నరసింహారావు అధ్యక్షత వహించారు. కాస్మో క్లబ్ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్, ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, భగవాన్ రాజు మాట్లాడుతూ, విద్యారంగం, క్రీడల అభివృద్ధికి తమ సంస్థ సహకారం అందిస్తుందని తెలిపారు. చాంబర్స్ కళాశాలలో సామాన్యులకు కూడా విద్య అందుబాటులో ఉంటుందన్నారు. విద్యార్థును ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న కళాశాల యాజమాన్యాన్ని, అధ్యాపకులను భగవాన్ రాజు అభినందించారు. కాలేజీ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. చాంబర్సు విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కాలేజీ కమిటీ అధ్యక్షుడు, మాట్లాడుతూ, ఇప్పటివరకు 1680 మందికి ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. ఖరీదైన ఇంజనీరింగ్ విద్యతోనే కాకుండా, చాంబర్స్ కళాశాలలో డిగ్రీ విద్యార్థులు కూడా తక్కువ ఖర్చుతో మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారని వెల్లడించారు. మరో ముఖ్య అతిథి, జిల్లా
డీఐఈఓ,బొక్కా అప్పారావు మాట్లాడుతూ, విద్యార్థులు శ్రమించే తత్వాన్ని అలవరచుకోవాలనీ, ఒక సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి అత్యున్నత స్థాయి కి ఎదిగిన సత్య నాదెళ్ల వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ కనుమూరి సీతారామరాజు,
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వేంకటేశ్వరరావు, గత ఏడాది అత్యున్నత రాంకులు సాధించిన విద్యార్థులకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన జిల్లా యూ టీ ఎఫ్ నాయకులు పోలిశెట్టి క్రాంతికుమార్, రామేశ్వరపు సత్యనారాయణ, కళాశాల ట్రెజరర్ రేపాక ప్రవీణ్ భాను, కళాశాల అకడమిక్ అడ్వైజర్లు డా. ఎబిఎస్ మూర్తి, నందుల సీతారామారావు, ఛాంబర్ ఆఫ్ కామర్సు సభ్యులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
వైస్ ప్రిన్సిపాల్ బి. విజయలక్ష్మి వందనసమర్పణచెసారు.
విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా, ఉల్లాసం జరిగాయి. సభికులను ఆకట్టుకొన్నాయి.