Telugu News Power

చించినాడలో ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.

విద్యార్థినికి ఉచిత సైకిల్ చేస్తున్న దృశ్యం

యలమంచిలి: మే,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలోనే తొలిసారి వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు బుధవారం చించినాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ విడత ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు 109 (8,9,10 తరగతుల) మందికి ఉచితంగా సైకిళ్ళు పంపిణీ చేశారు. శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ వారి సి ఎస్ ఆర్ నిధులతో సైకిళ్లు అందచేశారు. శ్రీ లలిత ఇండస్ట్రీస్ మేనేజింగ్
డైరెక్టర్లు, ఎం శ్రీనివాస్, ఎం ఆదిశంకరులు చేతులమీదుగా ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, ప్రముఖ రైస్ మిల్లర్ బంగారు కృష్ణ బాబు, ఏ యం సి చైర్మన్ కోడి విజయభాస్కర్, మామిడి శెట్టి పెద్దిరాజు, ఉన్నమట్ల కపర్ది, పీతల శ్రీనివాస్, తులా రామలింగేశ్వర రావు, రుద్రరాజు సత్యనారాయణరాజు, బోప్పన హరి కిషోర్, కొడవటి వరబాబు స్థానిక కూటమి నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.