Skip to main content

Telugu News Power

జిల్లాలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ వెలుగులు.

ఉచిత సోలార్ పథకం ప్రారంభ సభలో ప్రసంగిస్తున్న విప్ బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) జిల్లాకు తొలి విడతగా, 22,855 మంది ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు సోలార్ వెలుగులు ప్రసరించనున్నాయి. పి ఎం సూర్యఘర్ పధకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ పధకం ద్వార కేంద్ర ప్రభుత్వం నిధులు 60 వేల రూపాయలు, మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మొదటి విడత లబ్ధిదారులకు 260.18 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యంగల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తారు. తాడేపల్లిగూడెంలో 8,403 లబ్ధిదారులకు గాను తొలి విడతలో 3273 కుటుంబాలకు పథకం వర్తింపచేస్తారు. స్థానిక నియోజకవర్గం, నీలాద్రిపురంలో జరిగిన సభలో మంగళ వారం కలెక్టర్ చదలవాడ నాగరాణి వెల్లడించారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కలెక్టర్, నాగరాణి సోలార్ పథకం ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ వివరాలు తెలియజేశారు.