పాలకొల్లు: అక్టోబర్,6(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక చవాకుల చారిటబుల్ ట్రస్ట్, వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ చవాకుల సూర్య నరేష్ బాబుకు ప్రతిష్టాత్మక కళా సేవా పురస్కారం లభించింది. తాడేపల్లిగూడెం బివిఆర్ కళా కేంద్రం పురస్కారం అందజేసింది. కళా కేంద్రం నెలవారి నిర్వహించే సంగీత, నృత్య, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమంలో సురేష్ బాబును ఘనంగా సత్కరించారు. సురేష్ బాబు తమ ట్రస్ట్ ద్వారా సమాజ హితం కోసం చేస్తున్న అనేక మానవీయ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో, కళాక్షేత్రం అధ్యక్షులు, బుడ్డాల వెంకట రామారావు, గుండా రామకృష్ణ, తాళబత్తుల వెంకటేశ్వరరావు, హరిబాబు, కె.వి రామకృష్ణ, ఎన్ సోమేశ్వర రావు, కే నారాయణ రావు, కుమారి యశెస్వి, రాయి సూరిబాబు, ఫణి, చవాకుల సత్యనారాయణ మూర్తి, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ పుస్కారం అందజేసిన కళాకేంద్రం వారికి సురేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.
డాక్టర్ చవాకులకు, కళా సేవ పురస్కారం.
డాక్టర్ చవాకులకు పురస్కారం అందజేస్తున్న దృశ్యం