పాలకొల్లు: మే, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ వైయన్ కళాశాల మాజీ సెక్రెటరీ అండ్ కరెస్పాండెంట్, మాజీ వైస్ ప్రెసిడెంట్, ప్రముఖ పేదల వైద్యులు లయన్స్ ఇంటర్నేషనల్ 316జి మాజీ గవర్నర్, డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ మృతికి ఛాంబర్స్ కళాశాల యజమాన్యం, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
కళాశాల సెమినార్ హాల్ లో గురువారం నిర్వహించిన సంతాప సభలో కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు
మాట్లాడుతూ, డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ గత నాలుగున్నర దశాబ్దాలుగా శ్రీ వై ఎన్ కళాశాల అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేసి యూజీ నుండి పీజీ స్థాయికి అభివృద్ధి చేసి నాలుగు సార్లు నాక్ ఏ గ్రేడ్ ఎ ప్లస్ గ్రేడ్లు తీసుకువచ్చారన్నారు ఆయన నరసాపురం పరిసర ప్రాంతాల హస్తవాసి గల డాక్టర్గా, పేదల డాక్టర్గా, దీర్ఘకాలం సేవలు అందించారని లైన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు అన్నారు ఆయన మృతి విద్యారంగానికి, వైద్య రంగానికి పేద ప్రజలకు తీరని లోటు అని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు
ఈ సంతాప సభలో కార్యదర్శి కెవి సీతారామరాజు, కోశాధికారి ఆర్. ప్రవీణుబాను, ఉపాధ్యక్షులు తడవర్తి కృష్ణమూర్తి, అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఎబిఎస్ మూర్తి, యన్ .సీతారామరావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కారుమూరి బాబ్జి , అధ్యాపక ఆధ్యాపకేతర సిబ్బంది పాల్గొని డాక్టర్ చినిమిల్లికి నివాళులు అర్పించారు.
డాక్టర్ చినిమిల్లికి చాంబర్స్ కళాశాలలో సంతాప సభ.
డాక్టర్ చినమిల్లి (దాచిన చిత్రం)