Telugu News Power

ఏసీబీ వలకుచిక్కిన తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ

తాడేపల్లిగూడెం: మే, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్సై నాగ రాజు, కానిస్టేబుల్ బాలకృష్ణ అవినీతి నిరోధక శాఖ దాడిలో పట్టుబడ్డాడు. ప్రేమ వివాహం కోసం వచ్చిన జంట నుంచి సుమారు రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయంపై ఏసీబీ వారిని విశ్రయించగా వారు 70 వేల రూపాయల రసాయనాలు అద్దిన నోట్లు ఇచ్చారు. బాధితులు ఈ సొమ్ము, ఎస్సై కు ఇవ్వచూపగా, కానిస్టేబుల్ బాలకృష్ణకు ఇవ్వవలసిందిగా ఆదేశించారు. ఈ సొమ్ము అందుకున్న వెంటనే, అప్పటికే అక్కడ మాటివేసి ఉన్న ఏసీబీ అధికారులు ప్రత్యక్షంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అవినీతి నిరోధకశాఖ అధికారులు వీరి అక్రమ సంపాదన పై విచారణ చేపట్టనున్నామని తెలిపారు.