అమరావతి: జూన్,12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాలోకి జూలై మొదటి వారంలో నిధులు జమ చేయొచ్చునని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు సంబంధించి బడ్జెట్లో రూ. 9 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్న అందరికీ తల్లికి వందనం నిధులు జమ చేస్తాను. ప్రభుత్వం పెట్టిన నిబంధనల సంతృప్తి పరచిన మేరకు మాత్రమే నిధులు జమ అవుతాయి. రాష్ట్రంలో 68 లక్షల మంది తల్లులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. ఒక్కో విద్యార్థికి రూ.13 వేలు జమ చేస్తారు. మిగతా రూ.2 వేలు పాఠశాల నిర్వహణకు కేటాయిస్తారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ ఏడాది చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం అమలు చేస్తారు. పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థుల చదువుకు ఈ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం చేయూతనిస్తుంది. గత ప్రభుత్వం కుటుంబంలో ఒక్క బిడ్డకు మాత్రమే ఈ పథకం వర్తింపజేసేది. కూటమి ప్రభుత్వం వచ్చాక బిడ్డలందరికీ ఈ పథకం ద్వారా నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నది.