యలమంచిలి: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక తమ్మినీడి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో శుక్రవారం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) కార్యక్రమం పై అవగాహన శిబిరం నిర్వహించారు. తాసిల్దార్ గ్రంధి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం సమగ్రంగా, పారదర్శకంగా, ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితా తయారీకి సంకల్పించినట్టు తెలిపారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు ఈ ప్రక్రియ ద్వారా తొలగిస్తారని తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు, రెండేసి ఓట్లు, నకిలీ ఓట్లు ఈ ప్రక్రియ ద్వారా తొలగిస్తారని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం అని వెల్లడించారు. ఓటర్లు తమ వద్ద ఉన్న సరైన ఆధారాలను చూపి ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అధికారులు పరిశీలించే, 12 రకాల రుజువులలో ఏదైనా ఒకటి ఉంటే చాలన్నారు. ప్రత్యేక తణీఖీ కార్యక్రమంలో అధికారుల వీధులకు ఆటంకం కలిగించడం గాని, వారిపై ఒత్తిడి తీసుకురావటం వంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠినంగా శిక్షలు ఉంటాయని వెల్లడించారు. బి ఎల్ ఓ లు ఈ సమగ్ర బట్టల జాబితా తయారీకి, ఎలాంటి అవకతవకులు చోటు చేసుకోకుండా సమర్థవంతంగా అప్రమత్తతో పనిచేయాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పలువురు అధికారులు, బూత్ లెవెల్ అధికారులు, వివిధ పార్టీల బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.