Telugu News Power

కేరళం అందగత్తె స్థానం నుంచి, శ్రీకృష్ణ జన్మస్థానానికి హర్ష సన్నీ.

ముంబై: జూన్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక
విమానాశ్రయంలో మిస్ కేరళ-2025 మాజీ పోటీదారు హర్ష సన్నీని రూ.11.82 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాతో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసిన విషయం సంచలనం కలిగించింది. ఆమె బాంకాక్ నుంచి వచ్చిన విమానంలో ముంబైకి చేరగా, బ్యాగేజీ తనిఖీలో 11 కిలోలకుపైగా మత్తుపదార్థం లభ్యమైందని, ఎన్ డి పి ఎస్ చట్టం కింద అరెస్టు చేసి కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.హర్ష సన్నీ, 28 ఏళ్ల మోడల్, కేరళ అందగత్తెల పోటీల్లో ఆమె పాల్గొన్నారు.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిషేధిత మత్తు పదార్థాలతో పట్టుబడ్డారు.
బాంకాక్ నుంచి, ఈమె ఈ ఇండియా విమానంలో ఇండియాకు వచ్చారు. ఎయిర్ ఇంటిలిజెన్స్ అధికారులు 12 సీలు చేసిన, ద్రవ రూపంలో ఉన్న మరుజువాన ఏమి వద్దు లభించింది. వీటి బరువు
11 కిలోలకుపైగా ఉంది. మార్కెట్లో ఈ మత్తు పదార్థాల విలువ రూ.11.82 కోట్లు ఉంటుందని అధికారులు అంచనాలు వేశారు.
అధికారిక సమాచారం ప్రకారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ బృందం ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అరెస్టు అనంతరం హర్ష సన్నీని నార్కోటిక్ డ్రగ్స్, సైకో ట్రాఫిక్ పదార్థాల, నిషేధిత చట్టం 1985 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, ఈ సరుకు ముంబైలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎవరికి చేరాల్సి ఉందన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.