పాలకొల్లు: మే, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు-భీమవరం రోడ్డులో ఉన్న రైల్వే గేట్ ఈనెల 21, 22 న
రెండు రోజులపాటు రైల్వే ట్రాక్ మరమ్మత్తుల నిమిత్తం మూసివేస్తారని రైల్వే శాఖ తెలిపింది. ఇందువల్ల భీమవరం-పాలకొల్లు మధ్య ప్రయాణించే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లవలసిందిగా రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది. రైల్వే గేటు శుక్రవారం ఉదయం 7 గంటలకు మూసివేసి, శనివారం రాత్రి 7 గంటలకు తెరుస్తారని రైల్వేశాఖ వివరించింది.
నేడు, రేపు రైల్వే గేట్ మూసివేత.