
సింహాచలం: ఏప్రిల్, 19 (తెలుగు న్యూస్ పవర్. కా మ్) ద్వయవతార రూపుడైన సింహాసల క్షేత్రాధీశుడు వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం అక్షయతృతీయ సందర్భంగా సోమవారం జరుగుతుంది. ఈ సందర్భంగా, ఏడాదిలో ఒక్కసారి మాత్రమే 12 గంటల పాటు భక్తులకు తన నిజరూప దర్శనంతో అనుగ్రహం దర్శనం ఇస్తారు. వరాహ ముఖం, మానవ శరీరం, సింహం వాలము తో స్వామివారి దర్శనంలో భక్తులు తరిస్తారు. ఏడాదంతా స్వామివారికి చందనపు పూతతో అలంకరించబడి ఉంటారు. ప్రహ్లాదుని రక్షించడానికి, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను సంహరించిన రూపాలైన వరాహ, నరసింహ వాళ్లకు ప్రహ్లాదుడు ఆలయం కట్టించాడని స్థల పురాణం చెబుతున్నది. ఆ ఉగ్రరూపాన్ని చాలా పరచడం కోసం గంధ లేపనం ఏడాదంతా కప్పి ఉంటుంది. లక్షకు పైగా భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం 3 గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి. గతంలో జరిగిన అనుభవాలు దృష్ట్యా ఉన్నతాధికారులందరూ సమన్వయంతో క్యూ లైన్ లకు భక్తుల రాకపోకలకు శాశ్వత ప్రాతిపదికను నిర్మాణాలు చేశారు. భక్తులు ఈ దివ్య దర్శనం కోసం దేశం నిర్మాణం నుండి తరలి వస్తారు.
నేడే వరాహ నరసింహస్వామి వారి చందనోత్సవం.
వరాహ నరసింహ స్వామివారి నిజరూప దర్శనం (దాచిన చిత్రం)