పాలకొల్లు: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్)
నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా పనిచేశానో, ఇప్పుడు కూడా అలాగే కృషి చేస్తున్నానని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు ప్రధాన కాలువకు సంబంధించి రూ. 4.90 కోట్ల తో వివిధ పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకం ఉంచి, ఆశీర్వదించి నందుకు వారి ఆకాంక్షల మేరకు పనిచేయాలనే సంకల్పంతో అహర్నిశలు పాటుపడుతున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, తన మంత్రి పదవిని కూడా పక్కనపెట్టి, సాధారణ ఎమ్మెల్యే లాగా మంత్రులు, అధికారుల పేషేల చుట్టూ తిరిగి పనులు సాధించుకొస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్టష్టంగా ఉన్నప్పటికీ, నియోజకవర్గ లో పనులకు ఆటంకం లేకుండా నిధులు తెస్తున్నానన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ కూడా జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 269 అన్న క్యాంటీన్ల ద్వారా రోజు ఐదు లక్షల మందికి
5 రూపాయలకే భోజనం అందిస్తున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వానికి మాత్రమే అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని 30,31 వార్డుల ప్రజల కోసం 19 రేవులు, 70 లక్షలతో నిర్మిస్తున్నామన్నారు. కొబ్బరి వర్తకుల సంఘం భవనం వద్ద రూ.2.33 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నామన్నారు. దాసరి నారాయణరావు వంతెన మరమ్మత్తుల నిమిత్తం 18.50 లక్షలు, నాగరాజు పేట వంతెనకు రూ. 25 లక్షలు, ఎర్ర వంతెనకు రూ.12 లక్షలు, బ్రాడీపేట బైపాస్ కాలువకు సంబంధించి 10 రేవులకు రూ.40 లక్షలు, ఉల్లంపర్రు ఐటిఐ కాలేజీ కాలువ రిటైనింగ్ వాల్ కు రూ.65 లక్షలు, సైకిల్ వర్కర్స్ యూనియన్ భవనానికి రూ.15 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపనలు జరిగాయి. పాలకొల్లు లారీ స్టాండ్ వద్ద 12 కోట్ల రూపాయలతో ప్రధాన కాలువ పై వంతెన నిర్మిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పాలకొల్లు మార్టే రు రోడ్డు 25 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు కొక్కిరిగడ్డ జయరాజు, ఉన్నమట్ల కపర్తి, కటారి నాగేంద్ర కుమార్, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, కర్నేని గౌర్నాయుడు, పొట్లూరి శ్రీనివాస్, మండల అధ్యక్షులు పాముల రజిని కుమార్, నీటి సంఘం అధ్యక్షులు మాతా రత్నం రాజు, బోనం చిన్నబాబు, తులా రామలింగేశ్వర రావు, కొల్లి కొండ
ప్రసాద్, జగ్గరోతు రాంబాబు, మద్దాల వాసు, రాంప్రసాద్, ఐటిఐ నాని, పాశర్ల సింహాచలం, కొనిజేటి శ్రీహరి, ఆర్టీవో దాసిరాజు, కమిషనర్ విజయ సారధి,మండల అధికారులు ఎడ్ల దుర్గా కిషోర్, ఉమామహేశ్వరరావు, సి. ఐ రజిని కుమార్, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు వెంకటనారాయణ శ్రీనివాస రావు, మహిళలు ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు.
నేను మంత్రిని కాదు. -మంత్రి నిమ్మల రామానాయుడు