
కొత్త ఢిల్లీ/పాలకొల్లు జూలై,29 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, పద్మభూషణ్, డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలు మంగళవారం రాత్రి వరకు ఘనంగా జరిగాయి. అస్తిన లోని ఆంధ్ర అసోసియేషన్ భవనంలో ఈ పురస్కార ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సారస్వత పరిషత్, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేశారు. పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు, కేశిరాజు రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర భారీ పరిశ్రమ లు ఉక్కు శాఖ సహాయ మంత్రి, నర్సాపురం పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆ ఘోరంగా ప్రముఖులు ఉద్ధ రాజు కాశీ విశ్వనాథరాజు, గ్లోబల్ యూనివర్సిటీ చాన్సలర్ చైతన్య రాజు, సినీ నిర్మాత తుమ్మలపల్లి రమా సత్యనారాయణ,పూలపల్లికి చెందిన కాస్మో క్లబ్ అధ్యక్షులు, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, బిజెపి నాయకులు డి యు ఆర్ సి సభ్యులు, ఫొటోస్ అసోసియేషన్ కార్యదర్శి జక్కంపూడి లక్ష్మి నరసింహ నాగేంద్ర కుమార్, మహిళా మోర్చా నాయకు రాలు అల్లూరి పద్మ వర్మ, తదితరులు అవార్డులు అందుకున్నారు. విశిష్ట అతిధులుగా మాజీ గవర్నర్ రాజ్యసభ సభ్యులు కే లక్ష్మణ్, బీద మస్తాన్ రావు, సన్యాసి బాబు,ఎంపీ లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కృష్ణమోహనరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఐజేయూ సభ్యులు ముత్యాల శ్రీనివాస్, ఎస్బిఐ సుధీర్, కొల్లి కొండ ప్రసాద్, ఆరేటి సూర్య ప్రకాష్, ఆరేటి ప్రకాష్, ఈత పూట తాతాజీ తదితర పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
