పాలకొల్లు: జూన్ ,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సౌకర్యాల గురించి పట్టించుకునే నాధుడే లేడని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో, రైల్వే స్టేషన్ లో అసౌకర్యాలు తిష్ట వేశాయని ఆరోపిస్తున్నారు. గత 20 రోజులుగా లిఫ్టు పనిచేయకపోవడం వల్ల వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లేవారు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. ఫ్లాట్ ఫారం మారటానికి ఉన్న ఒకే ఒక్క లిఫ్ట్ తరచూ ఆగిపోతుందని ఆరోపిస్తున్నారు. రోజువారి ఉద్యోగ నిమిత్తం భీమవరం నుంచి విజయవాడ వరకు ఎందరో ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఇకనుంచి రైల్లో ప్రయాణం చేస్తుంటారు. లిఫ్ట్ పని చేయకపోవడం వల్ల ఒక్కోసారి కొన్ని క్షణాల వ్యవధిలో కళ్ళముందే రైలు కదలి వెళ్ళిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న వర్షా కాలానికి సంబంధించి, ఏ విధమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే స్టేషన్లో నీవు నీడ లేక తడిచిపోవాల్సి వస్తుందని, రేకుల షెడ్డు నంద్యాల నుంచి వర్షం పడటం వల్ల లగేజీలు కూడా తడిసిపోతున్నాయని
వాపోతున్నారు. రైల్వే అధికారులు తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పాలకొల్లు రైల్వే స్టేషన్ లో పనిచేయని లిఫ్ట్, 20 రోజులుగా ప్రయాణికులకు ఇక్కట్లు.