Telugu News Power

ఎయిమ్స్ – మంగళగిరి సందర్శన – సమీక్ష:

20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆసుపత్రి సందర్శన.


ప్రతిష్టాత్మక భారత ఎయిమ్స్ – మంగళగిరి ఆసుపత్రి సమగ్ర పరిశీలన.

నాడు దేశంలో చివరి స్థానం, నేడు ఎనిమిదో స్థానానికి ఎగబాకిన ఎయిమ్స్ సేవలు.

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కు ఏయిమ్స్ ప్రశంసనీయ సేవలు.

మంగళగిరి: జూన్, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్)ప్రధాని నరేంద్రమోడీ 12 ఏళ్ల పాలనలో ప్రజోపయోగ,అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అభివృద్ధి జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రజల అనుభవాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మంగళవారం మంగళగిరి అఖిలభారత వైద్య సంస్థ, ఎయిమ్స్ ను సంస్థ ఇంచార్జ్ డైరెక్టర, డీన్ రీసర్చ్ డా . జాయ్ ఘోషల్ , డీన్ అకాడమిక్ దేసు రామ్ మోహన్, వివిధ విభాగాల అత్యన్నత డాక్టర్లు మరియు ప్రొఫెసర్ల సమన్వయ సహకారంతో 20 సూత్రాల అమలు కమిటీ, చైర్మన్ లంకా దినకర్ సందర్శించారు. ఆధునిక వైద్య పరికరాల ద్వారా ఎయిమ్స్ అందిస్తున్న వైద్య సేవలు పరిశీలించి వైద్య సేవల కోసం వచ్చిన వారితో మమేకం అయ్యి వైద్య పరీక్షలు, స్కాన్లు మరియు ఇతర సేవల నాణ్యత పై అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి ఎయిమ్స్ సాధించిన పురోగతి పై సమీక్ష నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బిట్ర శివన్నారాయణ, ఎస్సీ మోర్చా నాయకులు మేకల లక్ష్మణ్, బీజేవైఎం నాయకులు నవనీత్ రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు తుళ్ళి మిల్లి రామకృష్ణ, పంచుమర్తి ప్రసాద్, మునగాల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పునర్విభజనచట్టం ప్రకారం 2015 లో నిర్మాణం ప్రారంభమై, రూ. 1,618 కోట్ల రూపాయలతో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో కేంద్రప్రభుత్వం ఎయిమ్స్ నిర్మాణం 2019 కి పూర్తి చేసింది. ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి వచ్చాయి.2019 లో సేవలు ప్రారంభించిన సమయానికి దేశంలోని మొత్తం ఎయిమ్స్ లలో చిట్ట చివరి స్థానంలో ఉన్న మంగళగిరి ఎయిమ్స్ నేడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఎయిమ్స్ లలో 8 వ స్థానం చేరుకుంది.
మంగళగిరి ఎయిమ్స్ లో నాణ్యమైన వైద్య సేవలు:

1) ఓపి సేవలు:
ఎయిమ్స్ ఇంచార్జ్ డైరెక్టర్ మరియు అధికారులు వివరిస్తూ, ఓపి కి రూ. 10 లు
ప్రస్తుతం ప్రతి రోజు సగటున 4 వేల ఓపీలు ఇన్ పేషంట్లుగా ( రోగులతో పాటు అటెండెన్స్ క్రింద మరో 2 వేల మంది అదనంగా) సేవలు వినియోగించుకుంటున్నారు. 2025 – 26 సంవత్సరంలో 9.85 లక్షల మందికి ఓపి సేవలు అందిచగా ఈ సంవత్సరం 10 లక్షల మందికి ఓపి సేవల రికార్డ్ సృష్టించబోతోంది, 2019 నుండి ఇప్పటి వరకు 35.26 లక్షల మంది సేవలను పొందారు.
2) ఆపరేషన్లు:
2018 నుండి ఇప్పటి వరకు 22,081 మేజర్ ఆపరేషన్లు మరియు 9,238 మైనర్ ఆపరేషన్లు కలిపి మొత్తం 31,319 ఆపరేషన్లు జరిగాయి.
3) డయాలిసిస్ సేవలు:
35 పడకలతో డయాలసిస్ సేవలు అందించడం జరుగుతుంది, సంస్థ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 16,586 మందికి సేవలు అందించారు.
4) రేడియాలజీ విభాగం సేవలు :
రోజుకు 600 నుండి 700 మందికి ఎక్స్ రే సేవలు, 250 నుండి 300 మందికి అల్ట్రా సౌండ్ సేవలు, క్యాన్సర్ రోగులకు ఇప్పటి వరకు 6,225 ఆంకాలజీ రేడియేషన్ సేవలు అందించామని డాక్టర్లు తెలిపారు. 33 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పెట్ స్కాన్, స్పెట్ స్కాన్ మరియు రేడియో థెరపీ సేవలు అందిస్తున్నారు. రోజుకు సగటున 80 కి పైగా ఎంఆర్ఐ స్కాన్లు మరియు 130 కి పైగా సిటి స్కాన్లు అతి తక్కువ ధరకు అందించడం జరుగుతుంది, ఎమర్జెన్సీ కేసులకు ఉచితంగా స్కాన్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మొత్తం 38 ల్యాబ్ లలో ల్యాబ్ మరియు డయాగ్నస్టిక్ సేవలు ఇప్పటి వరకు 66,23,923 అందించగా, 2025 – 26 సంవత్సరంలో 21.85 లక్షల మందికి ఈ సేవలు అందాయి.
5) తక్కువ ధరకు మందులు :
అమృత్ క్రింద నాణ్యమైన ప్రత్యేక మందులు మరియు నమ్మదగిన ఇంప్లాంట్లు అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి మరియు ఆసుపత్రిలోని జన ఔషధి కేంద్రంలో అతి తక్కువ ధరకు మందులు లభిస్తున్నాయని రోగులను ప్రత్యక్షంగా కలిసి వారి నుండి తెలుసుకోవడం జరిగింది.
6) ఆయుష్ ప్రారంభం:
ఆయుర్వేద మరియు హోమియోపతి వైద్య సేవలను అందించే సదుపాయాలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
7 ) ఆయుష్మాన్ భారత్ ఐడి :
ఇప్పటి వరకు 3,86,895 ఐడిలని ఇచ్చి 25,52,171 రికార్డులను లింక్ చేసి 10,42,947 రికార్డులను స్కాన్ చేసినట్లు అధికారులు తెలిపారు.ఎయిమ్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడం జరిగింది.
8)డాక్టర్లు, ప్రొఫెసర్లు , నర్సింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది :
45 రకాల డిపార్టుమెంట్లకు సంబంధించిన వివిధ విభాగాల్లో 42 డిపార్టుమెంట్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 1,698 లో 210 మంది ఫెకల్టీ, 46 మంది నాన్ ఫెకలిటీ – జీపీ ఏ , 233 మంది సీనియర్ రెసిడెంట్లు, 246 మంది జూనియర్ రెసిడెంట్లు, 84 మంది నాన్ ఫెకలిటీ – జీపీ బి, 218 మంది సీనియర్ నర్సింగ్ సిబ్బంది, 504 మంది జూనియర్ నర్సింగ్ సిబ్బంది, 157 మంది నాన్ ఫెకలిటీ – జీపీ సి లు సేవలు అందిస్తున్నారు.
9) విద్యార్థులు సంఖ్య:
మొత్తం క్యాంపస్ లో 70 రకాల కోర్సులకు సంబంధించిన 1280 pమంది విద్యార్థులు ఉన్నారు, అందులో 623 మంది ఎంబీబీఎస్, 30 డిపార్ట్మెంట్లలో 243 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు 17 డిపార్టుమెంట్లలో 49 మంది సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు ఉన్నారు. మిగతా విద్యార్థులు నర్సింగ్, హెల్త్ కేర్, ఎంఎస్సీ నర్సింగ్ తదితర విభాగాల్లో ఉన్నారు.
2019 – 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రహదారికి అవసరమైన భూమిని ఎయిమ్స్ వద్ద సమకూర్చ లేదు, కనీసం ఎయిమ్స్ కి అవసరమైన నీటి వసతి కల్పించడంలో విఫలం అయ్యారు అని లంకా దినకర్ తెలిపారు.
2024 లో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మరియు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి #పవన్ కళ్యాణ్ సమన్వయంతో ఏర్పడిన డబుల్ ఇంజిన్ సర్కార్ ఎయిమ్స్ రహదారికి అవసరమైన స్థలం మరియు ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన నీటి సరఫరాకి అవసరమైన మౌలికసదుపాయాలు కల్పించారని లంకా దినకర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఆధునిక సౌకర్యాలతో ఎదగాలని ఆకాంక్షించారు.