పోడూరు: జూన్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ పాఠశాల ఆట స్థలం నిరాదరణకు గురై, నిరుపయోగంగా మారింది. దాతల సహకారంతో మళ్లీ పూర్వ వైభవం వచ్చి విద్యార్థులకు ఆటస్థలం ఏర్పాటైన సంఘటన స్థానిక వేడంగి గ్రామంలో జరిగింది.
మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్) పాఠశాల ఆటస్థలం మొక్కలు పెరుగుట వలన ఆటస్థలం నిరుపయోగంగా మూలన పడింది. గ్రామ పెద్దలు బొలిశెట్టి మంగయ్య నాయుడు, బొలిశెట్టి నాగ రమేష్ ఈ సమస్య పరిష్కారం కోసం పూనుకున్నారు. దాత పాలకొల్లు జనసేన జిల్లా నాయకులు బోనం వెంకట నరసయ్య (చిన్నబాబు) 25వేల రూపాయల విరాళం ఇచ్చి ప్రోత్సహింసారు. కొట్టి శ్రీ వెంకటరత్నం (నాని గారు), కడలి మోహన్ కృష్ణ , కొట్టి భాస్కర రావు ఆర్థిక సహకారంతో మట్టి పూడిక, ఆట స్థలం చదును చేయటం పనులు పూర్తి చేశారు. శ్రమదానం చేసిన పోడూరి అనిల్ కుమార్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. పెద్ది రాజు, సహోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ యడ్ల ప్రసాద్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసినారు. ఆట స్థలం ఏర్పాట అవటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు ఆటస్థలం ఏర్పాటు.
పాఠశాల ఆటస్థలం అభివృద్ధికి సహకరించిన దాతలు