Telugu News Power

పాలకొల్లులో దర్శకరత్న దాసరి వర్ధంతి.

దర్శకరత్న దాసరికి నివాళులర్పిస్తున్న పట్టణ ప్రముఖులు

పాలకొల్లు: మే, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత దర్శకరత్న దాసరి నారాయణరావు 9వ వర్ధంతి సందర్భంగా ఆయన మాతృభూమి పాలకొల్లు లో పట్టణ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వ వహించిన దాసరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. పాలకొల్లు పట్టణాన్ని విశ్వ వినువీధులకు చేర్చారని వక్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా, కెనాల్ రోడ్డులో గల దాసరి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని కాపాడుకోవాలని తీర్మానించారు. ఫ్లెక్సీలతో మూసివేయటం, విగ్రహం పూంచిన కట్టడం దగ్గర పగుళ్లు ఏర్పడి ప్రమాదం పొంచి ఉన్నందున వాటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో, వంగ నరసింహారావు, యర్రం శెట్టి వెంకటరత్నం, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, విటాకుల వెంకటరమణ, కొమ్ముల మురళి, జి సత్యనారాయణ మూర్తి, దాసరి మహేష్, దాసరి బాలాజీ, గుడాల హరిబాబు, చవాకుల సూర్య నరేష్ బాబు, వినుకొండ శేషాద్రి,చుండూరి రంగయ్య నాయుడు, చిప్పాడా వామనమూర్తి,మండెల ఫణీంద్ర, జక్కంపూడి మధన్, ఎస్ వి రంగారావు, చిన్నమిల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.