పాలకొల్లు: ఆగస్టు, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజలకు విద్యుత్ సౌకర్యానికి సంబంధించి మౌలిక వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వమే మేటని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్వగ్రామం ఆగర్తిపాలెం లో జరిగిన పలు అభివృద్ధి పనులకు మంత్రి ఆదివారం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా వేసిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో నాగరాజు పేట విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించామన్నారు. వస్తున్నాడు విద్యుత్ సబ్స్టేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. యలమంచిలి మండలం, ఏనుగువానిలంకా, పోడూరు మండలం జున్నూరు గ్రామాలకు విద్యుత్ ఉపకేంద్రాలు మంజూరైనట్టు మంత్రి వెల్లడించారు. గత వైసిపి ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలు పేరుతో 11 సార్లు విద్యుత్ రేట్లు పెంచిందని గుర్తు చేశారు. ప్రస్తుత కోటను ప్రభుత్వం ట్రూ డౌన్ పద్ధతిలో వినియోగదారులపై ఏ విధమైన భారం పడకుండా విద్యుత్ బిల్లులు తగ్గించిందని తెలిపారు. పని చేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సుమారు రూ. 15 లక్షల వ్యయంతో కాపుల పాలెం, మామిడిగుంటలో ఏర్పాటు చేసిన రెండు 100 కెవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు మంత్రి కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. మంచినీటి పైపులైను పనులకు శంకుస్థాపన చేశారు. ఇందుకురూ.13 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు రామకృష్ణ, శ్రీనివాస్, కూటమి నాయకులు మీరు జాన్ డేవిడ్ రాజు, రాయి ప్రసాద్, శ్రీ రెడ్డి బాబులు, గిడుగు కిరణ్ నున్నపోయన సత్యనారాయణ, ప్రసాదు, నిమ్మల సారథి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు విద్యుత్ సౌకర్యల కల్పనలో కూటమి ప్రభుత్వమే మేటి. -మంత్రి నిమ్మల
మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం